Aeronautical Engineering: ప్రపంచ వ్యాప్తంగా ఏరోనాటికల్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ 8 d ago

ఆకాశమే హద్దుగా శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఏవియేషన్ ఒకటి. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా పోటీని తట్టుకోవాలంటే సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావల్సిన పరిస్ధితులు ఉన్నాయి. ఈ క్రమంలో సంబంధిత రంగంలో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం, విమానాలు అన్ని విధాలుగా సురక్షితంగా ఉన్నాయా లేవా అని పరీక్షించడం వంటి అంశాల పర్యవేక్షణకు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ నిపుణులు అవసరం.
ఏరోనాటికల్ ఇంజనీరింగ్
భిన్నంగా ఆలోచించే వారికి సరిగ్గా సరిపోయే కెరీర్ ఇది. గతంలో సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ వంటి సంప్రదాయ బ్రాంచ్‌లు మాత్రమే విద్యార్ధులకు అందుబాటులో ఉండేవి. కాలానుగుణంగా సీఎసీఈ, ఐటీ, మెటర్జీ వంటి స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లను ప్రవేశపెట్టారు. దీని ప్రధాన ఉద్దేశం ఆయా రంగాలపై సంపూర్ణ అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ బ్రాంచ్‌లను ప్రారంభించారు. అదే తరహాలో ఏరోనాటికల్ రంగానికి సంబంధించి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌ను రూపొందించారు.
రాష్ట్రస్ధాయిలో.....
ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవాలనుకునే వారు ఇంటర్మీడియట్ స్ధాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ తీసుకొని ఆయా సబ్జెక్టుల్లో మంచి ప్రావీణ్యం ఉండాలి. అన్ని ఇంజినీరింగ్ బ్రాంచ్‌ల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ ద్వారానే ఏరోనాటికల్ బ్రాంచ్‌లో ప్రవేశం కల్పిస్తారు.
జాతీయ స్ధాయిలో......
జాతీయ స్ధాయిలో ఐఐటీ, నిట్‌లు ఏరోనాటికల ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలు జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
అవకాశాలు
ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏరోనాటికల్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది. వీరు సాధారణంగా ఎయిర్ క్రాఫ్ట్‌ల డిజైనింగ్, కన్‌స్ట్రక్షన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్, ఆపరేషన్, సంబంధిత పరికరాల నిర్వహణ వంటి వాటిల్లో వీరు పాల్గొంటారు.
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి విమానయాన సంస్ధల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమ, అంతరిక్ష పరిశోధన సంస్ధలు, హెలికాఫ్టర్ కంపెనీలు, శాటిలైట్ మాన్యుఫాక్చరింగ్, రక్షణ దశలు, ఏవియేషన్ సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు, జాతీయ-అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. అలాగే NASA, DRDO, HAL ISRO లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
ఉన్నత చదువులు
బీటెక్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ తర్వాత ఆయా స్పెషలైజేషన్స్‌తో ఎంఈ/ఎంటెక్ పూర్తి చేయొచ్చు. పీజీలో ఏరోస్ఏస్ స్ట్రక్చర్స్, ఏరోడైనమిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ వంటి స్పెషలైజేషన్స్ తీసుకోవచ్చు.
ఏరోప్లేన్ గాలిలో సౌండ్ చేసుకుంటూ అలా వెళుతుంటే ఖచ్చితంగా తల పైకెత్తి చూస్తూ ఎప్పటికైనా ఏరోప్లేన్ లో ప్రయాణం చేయాలని, ఆ విభాగంలో ఉద్యోగం చేయాలని, వాటిని తయారు చేయాలనే కలలు కనేవారికి ఏరోనాటికట్ ఇంజనీరింగ్ మంచి కెరీర్ ఆప్షన్.
ఇది చదవండి: ఇంటర్ తర్వాత..ఎన్నో మార్గాలు..ఎంచుకునే మార్గమే కీలకం!